ఏపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక సాయం అందేలా, లబ్ది చేకూరేలా చర్యలు తీసుకుంటోంది. జగన్ సర్కార్ అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల్లో ఒకటి కళ్యాణమస్తు స్కీమ్. ఈ పథకం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మికుల కుటుంబాలకు వర్తించనుంది. పేద ఆడపిల్ల కుటుంబాలకు బాసటగా ఉండేందుకు, గౌరవప్రదంగా వివాహం జరిపించేందుకు తోడ్పాటుగా ఈ పథకాన్ని జగన్ సర్కార్ తీసుకొచ్చింది.