కాలచక్రం గిర్రున తిరిగింది. పాత స్మృతులను చెరిపేసింది. నేటితో క్యాలెండర్‌లో ఈ ఏడాది మాయమైపోనుంది. ఇప్పటికీ కంటికి కనిపించని మహమ్మారి భయం వెంటాడుతూనే ఉంది. 2020తో పోలిస్తే 2021లో పరిస్థితులు కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ.. అనేక వర్గాలు ఇప్పటికీ క్షామంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వ ఆదాయం క్షీణించింది. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. కోవిడ్ కట్టడికి చర్యలు చేపడుతూనే.. మరోవైపు విశాఖ ప్రగతికి బాటలు వేసింది. విశాఖను పరిపాలన రాజధానిగా తీర్చిదిద్దేందుకు సంకల్పించి 2021లో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాల కల్పనకు అనేక ప్రణాళికలు రూపొందించింది. గడిచిన ఏడాది కాలంలో సంక్షేమం, అభివృద్ధితో పాటు సుస్థిర, ప్రశాంత విశాఖ కోసం చేపట్టిన చర్యలు సత్ఫలితానిచ్చాయి. ఈ ఏడాది జిల్లాలో జరిగిన సంక్షేమం.. అభివృద్ధి.. వివిధ సంఘటనలు ఓసారి పరికిస్తే..