ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా రాష్ట్రంలోని 144 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 144 ఆక్సిజన్ ప్లాంట్లను జాతికి అంకితం చేస్తున్నామని తెలిపారు. మనమే సొంతంగా ఆక్సిజన్ సరఫలా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 100 పడకలు ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లపై 30 శాతం సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు.