విమానంలో సిగరెట్ తాగుతూ, రోడ్డుపై మద్యం సేవిస్తూ ఇటీవల వైరల్‌గా మారిన ప్రముఖ యూట్యూబర్ బాబీ కటారియా అరెస్ట్‌కు పోలీసులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. డెహ్రాడూన్‌లో రోడ్డు మధ్యలో మద్యం సేవిస్తూ ట్రాఫిక్ జామ్‌కు కారణమైన కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా బాబీ కటారియాను అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నారు. ఈ క్రమంలో యూట్యూబర్ ఆచూకీ చెప్పిన వారికి రూ.25,000 రివార్డ్ అందిస్తామని ప్రకటించారు.