ఈ మధ్య హిందూ పురాణాలకు సంబంధించిన సబ్జెక్ట్‌లు, భారతదేశ చరిత్ర చుట్టూ తిరిగే కథలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్, ది కాశ్మీర్ ఫైల్స్ నుండి కార్తికేయ 2 వరకు పాన్ ఇండియా లెవెల్ లో వసూళ్ల సునామి సృష్టించిన విషయం తెలిసిందే. ఆ వరుసలోనే ప్రభాస్ నటించిన “ఆదిపురుష్” కూడా వస్తుంది. హిందూ పురాణాల్లో ప్రథమంగా చెప్పే రామాయణ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది.