గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి, దుప్పట్లో చుట్టి నిర్మానుష్య ప్రదేశంలో పడేసిన కేసును వనస్థలిపురం పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన ఇద్ధరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హతుడి జేబులో లభించిన ఓ ఏటీఎం కార్డు నిందితులను పట్టించిందని పోలీసులు తెలిపారు. మంగళవారం వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం… నల్గొండ జిల్లా బొమ్మకల్ గ్రామానికి చెందిన కె. ప్రియాంక, అలియాస్ దీప్తి(27)కి పెళ్లి కాగా, భర్తకు విడాకులు ఇచ్చి ఉదయ్‌కుమార్ అనే వ్యక్తిని రెండోపెళ్లి చేసుకుంది. అతను గతేడాది కరోనాతో మృతి చెందాడు.