ఖమ్మం జిల్లాలోని తెలంగాణ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ ఓ మహిళ నిండు ప్రాణం తీసింది. ఆసుపత్రిలోని లిఫ్ట్ గుంతలో పడిపోయి ఆమె మరణించింది. వైరా మండలం గొల్లెనపహాడ్‌కు చెందిన ప్రమీల అనే మహిళ ఖమ్మంలోని తెలంగాణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను పరామర్శించేందుకు వెళ్లింది. పరామర్శ తర్వాత తిరిగి వెళ్లే క్రమంలో లిఫ్ట్ కోసం ఆగింది. కాసేపు లిఫ్ట్ ముందు నిలబడింది.