ప్రభుత్వ అధికారి అయిన తన భర్త నుంచి ప్రాణహాని ఉందని పోలీసులు తనను రక్షించి అతనిపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ వాపోయింది. ఐఎస్‌సదన్ డివిజన్ సరస్వతీనగర్ కాలనీకి చెందిన బాధితురాలు ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించింది. నాగార్జునసాగర్‌లో ఎస్‌ఈగా పనిచేస్తున్న కొర్ర ధర్మపై గతంలో ఏసీబీ అధికారులు దాడి నిర్వహించి పలు ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న బాధితురాలి పేరుతో ఉన్న ఆస్తులను తన పేరుపై రాసివ్వాలని భర్త ధర్మ వేధింపులకు దిగాడని ఆమె పేర్కొంది.
తనను ఇంటి నుండి బయటకు వెళ్లనీయకుండా ఒకగదిలో బంధించాడని ఆరోపించింది. ఈనెల 4న అతను, సహచరులతో కలిసి బలవంతంగా విషం తాగించి తనపై హత్యాయత్నం చేశారన్నారు. ఆసుపత్రిలో నాలుగు సర్జరీలతో తేరుకున్నానని వివరించారు. ఇంటి నుండి ఎలాగోలా బయట పడ్డానని, ఆస్తులన్నీ అతని పేరుతో బదలాయిస్తానని, కానీ తనకు అతని నుండి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. పోలీసు ఉన్నతాధికారులు రక్షణ కల్పించాలని ఆమె కోరారు.