భార్యపై తనకున్న అపార ప్రేమను ఓ భర్త వినూత్నంగా చాటుకున్నాడు. 40 ఏళ్ల వైవాహిక జీవితంలో తనకు వెన్నుదన్నుగా నిలిచిన భార్య భౌతికంగా దూరమైపోయినా.. ఆమె ప్రతిమతో వివాహ వార్షికోత్సవం జరుపుకున్నాడు. విజయవాడకు చెందిన మండవ కుటుంబరావు భార్య కాశీ అన్నపూర్ణ గతేడాది అనారోగ్యంతో మరణించారు.