విడాకులు ఇచ్చిన భర్త వేధింపులు రోజురోజుకూ ఎక్కువ అవుతుండటం, కుమారుడిని తీసుకువెళ్లి పంపకపోవడంతో మనస్తాపం చెందిన ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం హుడా కాలనీకి చెందిన షహజాబేగం(25), ఎంఎం పహాడీకి చెందిన షేక్ ఇమ్రాన్(29)తో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. షేక్ ఇమ్రాన్ స్థానికంగా హార్డ్‌వేర్ దుకాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఇతడికి బంధువుల మహిళతో అక్రమ సంబంధం ఉంది. సంవత్సరం క్రితం షహజాబేగం రెడ్‌హ్యాండ్‌గా పట్టుకొని నిలదీసింది.