పూణే పోలీసులు శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గుజరాత్‌కు చెందిన సదరు వ్యక్తి ఓ వ్యాపారవేత్త. అతని భార్య కూడా అదే కంపెనీకి డైరెక్టర్‌గా ఉంది. అయితే, 41 ఏళ్ల ఆ వ్యాపారవేత్త మరో యువతితో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. వ్యాపారం పేరిట ఊర్లు పట్టుకుని తిరుగుతున్నానంటూ బిల్డప్‌లు ఇచ్చేవాడు. అయితే అతని వ్యవహారం ఆమెకు అనుమానం తెప్పించడం మొదలుపెట్టింది. దీంతో భర్త వాహనంలో జీపీఎస్ పరికరాన్ని రహస్యంగా అమర్చింది. గత ఏడాది నవంబరులో బెంగళూరు వెళుతున్నానని భార్యతో చెప్పాడు సదరు వ్యాపారి. కానీ, జీపీఎస్ లొకేషన్ మాత్రం.. ఆ వాహనం మహారాష్ట్రలోని పూణేలో ఉన్నట్టు చూపించింది. దీంతో ఆమె అనుమానం మరింత బలపడింది.