ఇటీవల కొన్ని రోజులు బాలీవుడ్ లో బాయ్‌కాట్ ట్రెండ్ నడిచిన సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలని, నటుల్ని బాయ్‌కాట్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. సినిమా వాళ్ళు చెప్పుకోకపోయినా ఈ బాయ్‌కాట్ వల్ల కొన్ని సినిమాలకి భారీగానే నష్టం చేకూరింది. చాలా మంది బాలీవుడ్ నటులు ఈ బాయ్‌కాట్ ట్రెండ్ కి భయపడ్డారు. కొంతమంది నటులు అయితే ఈ బాయ్‌కాట్ ట్రెండ్ పై సీరియస్ అయ్యారు. తాజాగా కశ్మీర్ ఫైల్స్ సినిమాతో భారీ విజయం అందుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మాత్రం బాయ్‌కాట్ ట్రెండ్ ని సపోర్ట్ చేశారు.