దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. తొలి రోజు కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ… ఆధిక్యం మనదే.. గెలుపు సులువే అంటూ అభిమానుల ఆనందం.. కానీ రెండో రోజు ఆట చూద్దామనుకుంటే వరుణుడు ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లాడు.. వర్షం తగ్గకపోవడంతో ఆటను రద్దు చేశారు.. ఇక మూడో రోజైనా మనోళ్ల మెరుపులు చూడాలని భావించిన వాళ్లకు ఆరంభంలోనే తీవ్ర నిరాశ… లుంగి ఎన్గిడి, కగిసో రబడ దెబ్బ మీద దెబ్బ కొట్టారు. వరుసగా వికెట్లు కూల్చి 272 పరుగుల స్కోరు వద్ద ఆటను ఆరంభించిన భారత జట్టును 50 పరుగుల వ్యవధిలోనే ఆలౌట్ చేశారు.