‘‘ఒకేసారి రెండు సినిమాలను నిర్మిస్తూ ఇద్దరు దర్శకులకు అవకాశం ఇవ్వడం అనేది గొప్ప విషయం. జీవీ నాయుడు నిర్మిస్తున్న ఈ రెండు చిత్రాలు గొప్ప విజయాలు సాధించాలి’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. వీఆర్‌జీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై గొంగటి వీరాంజనేయ నాయుడు నిర్మిస్తున్న రెండు సినిమాల ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. వీఆర్‌జీఆర్ ప్రొడక్షన్స్‌లో తొలి సినిమాగా ఫిల్మీ గ్యాంగ్‌స్టర్స్ దర్శకత్వంలో ఓ హారర్ సినిమాను గొంగటి వీరాంజనేయ నాయుడు (జీవీ నాయుడు) నిర్మించనున్నారు.