గుంటూరు జిన్నా టవర్ సెంటర్‌లోని జిన్నా స్థూపంపై జెండా ఎగురవేయాలని ప్రయత్నించిన వీహెచ్‌పీ సభ్యులు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. లాలాపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గణతంత్ర దినోత్సవం రోజు బుధవారం జిన్నా టవర్‌పై జెండా ఎగురువేయడానికి ఈవూరి జగన్ సాయినాథ్‌రెడ్డి, రావిరాల జీవన్‌బాబు, గిరిఈశ్వర్, కె.దుర్గాబాబు, నల్లమేకల సురేష్ వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేశారు. కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలోనూ ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.