చైన్నై: చెన్నైకు చెందిన ఉషా తీవా క్యూట్ స్మైల్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. వైబ్రెంట్ కాన్సెప్ట్స్ నిర్వహించిన మిస్సెస్ ఇండియా గెలాక్సీ 2021 పోటీలు విజయవంతంగా జరిగాయి. ఈ పోటీల్లో మిస్సెస్ క్యూట్ స్మైల్ కిరీటాన్ని సామాజిక సేవకురాలు, పారిశ్రామిక వేత్త ఉషా తీవా గెలుచుకున్నారు. ఈ పోటీల్లో ముఖ్య అతిథిగా సెలబ్రిటీ ఫ్యాషన్ కొరియోగ్రాఫర్ కరణ్ రామన్ హాజరయ్యారు. ఉషా తీవా సోమవారం మాట్లాడుతూ లక్షలాది మంది పేద ప్రజలకు దుస్తులను వితరణ చేస్తూ తన వంతుగా సమాజ సేవ చేస్తున్నానని తెలిపారు.