ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలో ఇరుజట్లు చెరొకటి గెలుచుకున్నాయి. రేపు ఉప్పల్ స్టేడియంలో ఫైనల్ పోరులో జరగనుంది. ఇందుకోసం ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. మ్యాచ్‌కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అయితే నేడు సాయంత్రం భారత్, ఆస్ట్రేలియా ఇరు జట్ల ఆటగాళ్ళు హైదరాబాద్ చేరుకుంటారు. మూడు సంవత్సరాల తరువాత హైదరాబాద్ లో జరుగుతున్న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కావటంతో వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించడంతో ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశముంది. దీంతో అభిమానులు మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.