అత్యాచార నిందితులకు ముందస్తు బెయిల్ దొరక్కుండా యోగి ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రాసెడ్యూర్ (ఉత్తరప్రదేశ్ అమెండ్మెంట్) బిల్-2022 పేరుతో తీసుకువచ్చిన ఈ బిల్లుకు శుక్రవారం ఆమోదం లభించింది. యూపీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ కుమార్ ఖన్నా.. సభలో ఈ సవరణ బిల్లును ప్రవేశ పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలపై దురాచారాలకు పాల్పడే వారు ముందస్తు బెయిల్ పేరుతో తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే ఈ బిల్లును తీసుకువచ్చినట్లు చెప్పారు.