ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో చాలా ఆఫీసులు, రెస్టా రెంట్లు, కాన్సర్ట్ హాల్స్, సినిమా థియేటర్లు, కొన్ని బ్యాంకులు… వాళ్ల ఆవరణలోకి అడుగుపెట్టాలంటే వ్యాక్సినేషన్ చేసుకున్నారా? లేదా? అని అడుగుతున్నాయి. కొన్ని సంస్థలయితే వాక్సిన్ కంపల్సరీ చేశాయి. అయితే ప్రతి చోటికీ వాక్సినేషన్ సర్టిఫికెట్‌ను పట్టుకెళ్లలేం కదా! అందుకే ఆ వివరాలన్నీ భద్ర పరిచి చర్మం కింద అమర్చగలిగే ఓ చిప్‌ను ఆవిష్క రించింది స్వీడిష్ స్టార్టప్ ఎపిసెంటర్.