22వ కామన్వెల్త్ క్రీడలు ముగిసాక మహిళల క్రికెట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ణారణ అయిన ఓ క్రికెటర్ బరిలోకి దిగడమే కాకుండా అందరితో కలియతిరిగుతూ సంబురాలు చేసుకుంది. భారత్‌తో ఫైనల్ మ్యాచ్‌కు ముందు స్టార్ ఆల్‌రౌండర్ తహ్లియా మెక్‌గ్రాత్‌కు కోవిడ్ పాజిటివ్ అని తెలిసినా ఆసీస్ మేనేజ్‌మెంట్ అమెను తుది జట్టుకు ఎంపిక చేసి, బరిలోకి దించింది.
ఈ మ్యాచ్‌లో మెక్‌గ్రాత్ బ్యాటింగ్‌లో 2 పరుగులు, బౌలింగ్‌లో 2 ఓవర్లలో 24 పరుగులిచ్చి ఏమంత ఆశాజనకమైన ప్రదర్శన చేయనప్పటికీ.. టీమిండియా స్వయంకృతాపరాధాల కారణంగా ఆస్ట్రేలియా 9 పరుగుల తేడాతో విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. అయితే, తమ ప్లేయర్‌కు కోవిడ్ అని తెలిసినా ఆసీస్ యాజమాన్యం ఆమెను తుది జట్టుకు ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్త తెలిసి యావత్ క్రీడాలోకం షాక్‌కు గురైంది.