తెలంగాణ ప్రభుత్వం కడుతున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లతో పాటు మరో లిమిటెడ్ సంస్థకు చెందిన పనులు ఇప్పిస్తామంటూ నగరానికి చెందిన వ్యక్తిని మోసం చేసిన ముఠాపై హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు కేసు నమోదు చేశారు. రూ.579 కోట్ల పనులు సబ్–కాంట్రాక్ట్‌కు ఇస్తామంటూ రూ.3 కోట్లు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని అధికారులు తెలిపారు. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన సివిల్ ఇంజినీర్ కె.జగదీశ్వర్ దాదాపు పదహారేళ్లుగా సాయిడక్స్ ఇంజినీర్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థ నిర్వహిస్తున్నారు. శివప్రసాద్ అనే దళారి ద్వారా ఈయనకు గతేడాది సెప్టెంబర్ 21న డీఎన్‌సీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ డి.నరేష్ చౌదరి కలిశారు.