ఉత్తరాఖండ్ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 228 మందికి ఇచ్చిన అడ్-హాక్ అపాయింట్మెంట్స్ నియామకాలన్నింటినీ రద్దు చేశారు. అంతే కాకుండా శాసన సభ కార్యదర్శి ముకేశ్ సింఘాల్‌ను సస్పెండ్ చేశారు. రితు ఖండూరీ శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, శాసన సభ సచివాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఈ నియామకాలు జరిగాయని, అందుకే వాటిని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.