బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్‌వెల్త్ క్రీడల బాక్సింగ్‌లో భారత పోరాటం ముగిసింది. పురుషుల 92 కేజీల విభాగంలో సాగర్ అహ్లావత్ రజతం సాధించడంతో బాక్సింగ్‌లో భారత ప్రస్థానం సమాప్తమైంది. పదో రోజు సాగర్ అహ్లావత్.. ఇంగ్లండ్‌కు చెందిన డెలిసియస్ ఓరీ చేతిలో 5-0 తేడాతో ఓటమిపాలై రజతంతో సరిపెట్టుకున్నాడు.
సాగర్ పతకంతో బాక్సింగ్‌లో భారత పతకాల సంఖ్య ఏడుకు (3 గోల్డ్, సిల్వర్, 3 బ్రాంజ్) చేరింది. ఓవరాల్‌గా 10వ రోజు ముగిసే సమాయానికి భారత్ ఖాతాలో 55 పతకాలు (18 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్యాలు) చేరాయి.