రామనగర పట్టణ పరిధిలోని రైల్వేస్టేషన్ రోడ్డులో పునాది కోసం తవ్వుతుండగా పురాతన కట్టడం వెలుగు చూసింది.న వాజ్ అహ్మద్ అనే వ్యక్తి తన స్థలంలో దుకాణం నిర్మించడానికి పునాది కోసం పాయ తీయిస్తుండగా కట్టడం బయటపడింది. నాణ్యతతో నిర్మించబడిన ఆ కట్టడం వందల ఏళ్ల నాటిదని తెలుస్తోంది. క్రమంగా మట్టిలో మూసుకుపోవడంతో భూగర్భంలో కలిసిపోయి ఎవరి కంటా పడలేదు.