ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) నిర్మాణానికి రూ.100.38 కోట్ల బడ్జెట్ ఆమోదించగా.. సర్వే, సరిహద్దు గోడ నిర్మాణం వంటివాటికి రూ.0.70 కోట్లు వెచ్చించినట్లు కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాశ్ తెలిపారు. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఏజెన్సీ అయిన నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌కి రూ.93.18 కోట్లు, యంత్రాలు, పరికరాలు, లైబ్రరీ పుస్తకాలకోసం ఎన్‌ఐడీ అహ్మదాబాద్‌కు రూ.6.50 కోట్లు విడుదల చేసినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, ఎం.వి.వి.సత్యనారాయణ, రెడ్డప్ప అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.