శ్రీవారి ప్రత్యేక దర్శనం రూ.300 టికెట్లను ఫిబ్రవరి నెలకు సంబంధించి టీటీడీ ఈనెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఫిబ్రవరి నెలకు స్లాటర్ సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టికెట్లను శనివారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ పీఆర్‌వో విభాగం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. భక్తులంతా విడుదల చేసే సమయంలో టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లలో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.