మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తి, జయం రవి, ప్రకాశ్ రాజ్, ఐశ్వర్యా రాయ్, త్రిష, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ.. లాంటి ఎంతోమంది స్టార్ యాక్టర్స్ తో తెరకెక్కిన భారీ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్ 1’. ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా, చోళుల కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా సెప్టెంబర్ 30న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ ప్రమోషన్స్ లో హీరోయిన్ త్రిష ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది. పిరియాడికల్ సినిమా కావడంతో రాజుల ఆహార్యానికి తగ్గట్టు దుస్తులు, నగలు డిజైన్ చేశారు. వాటి గురించి త్రిష మాట్లాడింది.