సద్దుల బతుకమ్మ కార్యక్రమం నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎల్బీస్టేడియంలో సోమవారం నిర్వహించే సద్దుల బతుకమ్మ కార్యక్రమం నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్బీ స్టేడియం, లిబర్టీ జంక్షన్‌తో పాటు అప్పర్ ట్యాంక్‌బండ్ పరిసరాల్లో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు భారీగా ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశాలున్నాయని తెలిపారు.