కోవిడ్ సెకండ్ వేవ్ కల్లోలం తర్వాత పర్యాటక రంగానికి నూతన టూరిజం పాలసీ (2020–2025) కొత్త ఊపు ఇచ్చింది. గత పాలసీ కంటే మెరుగ్గా.. పెట్టుబడిదారులను ఆకర్షించే రాయితీలతో సుమారు రూ.2,600 కోట్లకు పైగా ప్రాజెక్టులను సమీకరించింది. ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఆతిథ్య రంగ సంస్థలైన ఒబెరాయ్, తాజ్ వరుణ్, హయత్ సంస్థలు రాష్ట్రంలో ఏడు, ఐదు నక్షత్రాల హోటళ్లు, అత్యాధునిక వసతులతో విల్లాలను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చాయి. వీటి ద్వారా దాదాపు 48 వేల మందికి ఉపాధి దక్కనుంది.