జీలుగ కల్లు తాగిన ఐదుగురు గిరిజనులు మృతి చెందారు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలోని రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన చదల సుగ్రీవ(70), బూసరి సన్యాశిరావు(65), పొత్తూరి గంగరాజు(35), వేమా లోవరాజు(28), కుడే ఏసుబాబు(23), గంగరాజు తండ్రి వెంకటేశ్వర్లు రోజూ మాదిరిగానే బుధవారం ఉదయాన్నే తమకు సమీపంలోని జీలుగ చెట్టు నుంచి కల్లు సేకరించారు. సుగ్రీవ, సన్యాశిరావు, గంగరాజు, లోవరాజు, ఏసుబాబు దానిని తాగగా.. వెంకటేశ్వర్లు కల్లు నుంచి దుర్వాసన వస్తోందని ఉమ్మేశాడు.