కాలేయం శరీరంలో అతిపెద్ద అవయవం. ఇది అనేక విధులను నిర్వహిస్తుంది. శరీరంలోని మలినాల వడపోత, ఆహారం జీర్ణక్రియ, ప్రోటీన్ సంశ్లేషణ, శరీరంలో వివిధ అవసరాల కోసం విటమిన్లు, ఖనిజాల నిల్వ చేయటంలో కాలేయం ప్రముఖపాత్ర పోషిస్తుంది. ఆహరపు అలవాట్లు, అనుసరించే జీవనశైలి కాలేయంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. దీని ఫలితంగా అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం సరైన ఆహారాన్ని రోజువారిగా తీసుకోవాలి. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాలు, పానీయాలు తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..