ఏపీ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్ల హేతుబద్ధీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోందని ఏపీ ఫిల్మ్ చాంబర్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రాందాస్ అన్నారు. ప్రభుత్వ నిర్ణయం కోసం సినీ పరిశ్రమ ఎంతగానో ఎదురుచూస్తోందన్నారు. హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ బుధవారం సచివాలయంలో సమావేశ మైంది. ఇందులో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సినీ గోయర్స్, థియేటర్లు, ఫిల్మ్ చాంబర్ అసోసియేషన్ సభ్యుల నుంచి లిఖితపూర్వకంగా అభిప్రాయాలను స్వీకరించారు.
మున్సిపాలిటీలు, నగర, గ్రామ పంచాయతీల్లో రేట్లు తక్కువగా ఉండటంతో వాటిని పెంచాలని పలువురు సభ్యులు కమిటీకి విజ్ఞప్తి చేశారు. సుమారు మూడు గంటలపాటు జరిగిన చర్చలో టికెట్ రేట్లను ప్రాంతాల వారీగా నిర్ణయిం చాలా?, థియేటర్లను బట్టి ఉండాలా? అనే అంశా లపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా సచివాలయంలో రాందాస్ మీడియాతో మాట్లాడు తూ.. ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందన్నా రు. తదుపరి సమావేశంలో అన్ని అంశాలపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయన్నారు. పలు సిని మాలు విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రక్రి యను వేగంగా పూర్తిచేయాలని కోరామన్నారు.