తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. తక్కువ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదవుతుండటం ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో 7వేల 007 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 71 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 47 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 7 కేసులు వెల్లడయ్యాయి.