ఇన్నాళ్లూ లేనిది.. మావోయిస్ట్ పార్టీ ఇప్పుడే యాక్టివ్ అవటానికి ఓ రీజన్ ఉంది. పార్టీ ఇప్పుడు రిక్రూట్‌మెంట్ మీద ఫోకస్ పెంచింది. అంతేకాదు.. అర్బన్ మావోయిజాన్ని కూడా విస్తరించేందుకు ప్రయత్నిస్తోందని.. పోలీస్ ఇంటలిజెన్స్ వర్గాలు పసిగట్టాయ్. అంతేకాదు.. కోవర్టులుగా ఉంటూ పార్టీకి నష్టం చేసిన వారిని ప్రజా కోర్టులో శిక్షించాలని అన్ని దళాలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకే.. తెలంగాణ-చత్తీస్‌గఢ్ పోలీసులు జాయింట్‌గా.. యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు.