ఆసియా కప్-2022 టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి స్థానం లేకపోవడం పట్ల టీమిండియా మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్ విస్మయం వ్యక్తం చేశాడు. ఒకవేళ తానే గనుక ప్రస్తుత సెలక్టన్ టీమ్ చైర్మన్ అయి ఉంటే కచ్చితంగా షమీకి జట్టులో చోటు ఇచ్చేవాడినని ఈ మాజీ సెలక్టర్ పేర్కొన్నాడు. నలుగురు స్పిన్నర్లను తీసుకునే బదులు ఈ వెటరన్ పేసర్‌ను ఎంపిక చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.