భారత పురుషులు, మహిళల క్రికెట్ జట్ల కోసం బీసీసీఐ ఆదివారం కొత్త టీ20 జెర్సీని విడుదల చేసింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే 2022 టీ20 ప్రపంచ కప్‌కు ఒక నెల ముందు, ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 సిరీస్‌కు రెండు రోజుల ముందు ఈ కొత్త జెర్సీని బీసీసీఐ విడుదల చేసింది. అయితే ఈ జెర్సీని టీమిండియా ఆటగాళ్లు సెప్టెంబర్ 20 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్ నుంచే ధరించనున్నారు.