కరోనాను అరికట్టే ప్రక్రియలో సీరమ్ సంస్థ తయారీ కోవోవ్యాక్స్ టీకాను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు అనుమతించవచ్చని సీడీఎస్‌సీఓకు చెందిన నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అదేవిధంగా కరోనా చికిత్సలో మొల్న్యుపిరావర్ మాత్రల ఉత్పత్తి, అత్యవసర వినియోగ అనుమతికి కూడా పచ్చజెండా ఊపింది. కోవోవ్యాక్స్‌పై నిపుణుల కమిటీ రెండుమార్లు పరిశీలన జరిపి చివరకు కొన్ని పరిస్థితుల్లో అత్యవసరంగా వాడేందుకు అనుమతించవచ్చని సిఫార్సు చేసింది.