కోలీవుడ్ స్టార్ సూర్యకు అటు తమిళ్ ఇటు తెలుగులోనూ అభిమానులు ఎక్కువే. మాస్ పాత్రల్లోనే కాకుండా, క్లాస్, వైవిధ్యమైన రోల్స్‌లో అదరగొడుతుంటాడు. కథ విభిన్నంగా ఉంటే చేసేందుకు అస్సలు వెనకాడడు. అందుకే ఈ తమిళ హీరో అంటే టాలీవుడ్‌లోనూ ఫుల్ క్రేజ్. ఇటీవల ‘జైభీమ్’, ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు సూర్య. ఈ చిత్రాల తర్వాత సూర్య చేస్తున్న మూవీ ‘ఈటీ’ (ఎతర్క్కుమ్ తునిందవన్) అని తెలిసిందే.