టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం లంకాషైర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ కౌంటీల్లో బిజీగా ఉన్నాడు. గాయంతో దూరమైన సుందర్ కౌంటీల్లో ఆడుతూ సూపర్ ప్రదర్శనతో రెచ్చిపోతున్నాడు. తాజాగా మ్యాచ్ గెలిచిన ఆనందంలో సుందర్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాయల్ లండన్ వన్డే-కప్‌లో భాగంగా లంకాషైర్, యార్క్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్‌లో లంకాషైర్ ఏడు వికెట్లతో విజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన సంతోషాన్ని లంకాషైర్ జట్టు సభ్యులు డ్రెస్సింగ్‌రూమ్‌లో పెద్ద ఎత్తున్న సెలట్రేట్ చేసుకున్నారు. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఒకరిని ఒకరు అభినందించుకుంటూ డ్యాన్స్ చేశారు. సుందర్ కూడా చిన్న పిల్లాడిలా మారిపోయి గెంతులేయడం కనిపించింది.