స్కూల్లో విద్యార్థుల మధ్య గొడవలైనా, సీనియర్లు కొట్టినా పిల్లలు సాధారణంగా టీచర్లకు ఫిర్యాదు చేస్తుంటారు. కానీ, ఒక స్కూల్ స్టూడెంట్ మాత్రం తన సీనియర్‌పై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహంలో చదువుతున్న పదో తరగతికి చెందిన నవీన్ ఒక విద్యార్థి తరచూ ఎనిమిదో తరగతి చదువుతున్న ఉపేందర్ అనే విద్యార్థిని కొడుతున్నాడు. దీనిపై ఉపేందర్ హాస్టల్ వార్డెన్‌కు ఫిర్యాదు చేశాడు. అయినా వార్డెన్ పట్టించుకోలేదు. దీంతో విసుగు చెందిన ఉపేందర్ ఏకంగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.