ఒకప్పుడు శ్రీకృష్ణుడు గోవర్థనగిరిని ఎత్తాడట..మరిప్పుడు.. కృష్ణుడు రాకున్నా.. ఏకంగా 1,37,000 కిలోల బరువున్న ఓ గిరిని మనమే ‘ఎత్తేయొచ్చు’!!అదెలా తెలుసుకోవాలంటే.. చలో మరి.. ఫ్రాన్స్ లోని హ్యూల్‌గోట్ అటవీ ప్రాంతానికి.. ఎందు కంటే.. ఇక్కడ ఎలాంటి మ్యాన్ అయినా.. సూపర్ మ్యాన్ అయిపోతాడు.. ఇంతకీ విషయమేమిటంటే.. ఈ ప్రాంతంలో బాగా ఫేమస్ అయిన ఓ భారీ బండ ఒకటి ఉంది..7 మీటర్ల పొడవుండే.. దాని బరువు 1.37 లక్షల కిలోలు.. వినగానే.. దీన్ని కదపడం కూడా అసాధ్యమనే అనిపిస్తోంది కదూ..