ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఊబకాయుల సంఖ్య పెరుగుతోంది. మరీ ముఖ్యంగా కొందరు ఆడవారికి ఇంటిపనితో పాటు ఆఫీస్ ఒత్తిడి పెరిగిపోవడం లేదా శరీరంపై శ్రద్ధ తగ్గడంతో బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోతూ ఉంటుంది. వేళకు మంచి ఆహారం తీసుకోకపోవడం, శరీరానికి సరైన వ్యాయామం అందకపోవడం.. ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం.. ఇలా పలు కారణాలతో.. పొట్ట, నడుము, పిరుదులు, చేతులు, తొడలు.. ఇలా చాలా భాగాల్లో కొవ్వు పేరుకుపోయి.. చూడటానికి షేప్‌లెస్‌గా మారిపోతుంటారు చాలా మంది. అతి తక్కువ సమయంలో స్లిమ్‌గా, నాజుగ్గా మారాలంటే ఈ బ్యాగ్‌లో చక్కగా ఓ కుర్చీ వేసుకుని కూర్చుంటే సరి. అదే ఈ పోర్టబుల్ పర్సనల్ స్టీమర్ ప్రత్యేకత.