శ్రీలంక ప్రభుత్వ చెరలో ఉన్న తమిళనాడు జాలర్ల విడుదలపై జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ ద్వారా బుధవారం విజ్ఞప్తి చేశారు. శ్రీలంక సముద్రతీర రక్షణ దళాలు 29 మంది జాలర్లను, వారికి చెందిన 79 మరపడవలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నాయని అందులో పేర్కొన్నారు.