ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా నుంచి పలాస జీడిపప్పును అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ప్రాసెసర్ల పరిస్థితికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన, సమాచారం లేదని కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్ బుధవారం లోక్‌సభలో చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కోటగిరి శ్రీధర్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు.