‘నాకు ఉద్యోగం వచ్చిన విషయం నాకే తెలియకుండా’ఏడాదిన్నర కాలంగా మరొకరు నా విధులు నిర్వహిస్తూ నా పేరుతో జీతం కాజేస్తున్నారని’, తన ఉద్యోగం తనకు ఇప్పించాలంటూ కాజులూరు శివారు రాంజీనగర్‌కు చెందిన బిల్లా రోజా సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందన కార్యక్రమంలో ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. 2020 మే నెలలో కాజులూరులో డ్వాక్రా యానిమేటర్ పోస్టుకి నోటిఫికేషన్ పడటంతో బిల్లా రోజా దరఖాస్తు చేసుకున్నారు. 16 మే 2020న రోజాను యానిమేటర్‌గా ఎంపిక చేస్తూ తీర్మానం చేశారు.