అప్పట్లో అంతరిక్ష ప్రయాణమంటే కల్లోనే సాధ్యం, కానీ పెరిగిన టెక్నాలజీతో బాగా డబ్బున్న ఆసాములు ప్రైవేట్‌గా అంతరిక్షంలోకి ట్రిప్ వేసే వీలు కలిగింది. ఇప్పటివరకు ప్రభుత్వాల ఆధీనంలోనే ఉన్న అంతరిక్ష ప్రయాణం ప్రైవేట్ కంపెనీల ప్రవేశంతో రూపుమారుతోంది. దీంతో ఇకపై అంతరిక్షంలో వాణిజ్య ప్రకటనల పోటీ పెరగనుంది. ప్రస్తుతం భూమిపై కాదేదీ ప్రకటనలకనర్హం అనే రీతిలో వాణిజ్య ప్రకటనల జోరు కొనసాగుతోంది. ఏ కాస్త ఖాళీ స్థలం కనిపించినా, దానిపై తక్షణమే ఏదో ఒక కమర్షియల్ ప్రకటన ప్రత్యక్షమవుతోంది. వ్యాపారాల్లో పోటీ పెరిగే కొద్దీ కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీలు అడ్వర్టైజింగ్‌పై భారీగా వెచ్చిస్తున్నాయి.