ఎస్సైగా పోస్టింగ్ పొందిన చోటే ఎస్పీ హోదాలో విధుల్లో చేరడం ఆనందంగా ఉందని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నూతనంగా విధుల్లో చేరిన ఎస్పీతో సోమవారం ‘సాక్షి’ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు వెల్లడించారు. 1991లో పోలీసు శాఖలో ఎస్సైగా విధుల్లో చేరా. ఉట్నూర్ ఏరియాలో తుపాకీ భుజాన వేసుకుని అడవులను జల్లెడ పట్టా. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ హిస్టరి పట్టా పొందా. ఉట్నూర్ పోలీసు స్టేషన్‌లో ప్రొహిబిషన్ ఎస్సైగా కడెం పోలీసు స్టేషన్‌లో ఎస్సైగా పనిచేశా. మావోయిస్టుల కార్యకలాపాలపై దృష్టి సారించి జిల్లా నుంచి వారిని తరిమివేయడంతో ప్రభుత్వం సీఐగా పదోన్నతి కల్పించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఎస్పీ హోదాలో జిల్లాకు వచ్చా. 18 సంవత్సరాల పాటు జిల్లాలో పనిచేసిన అనుభవం ఉంది.