‘వరి,గోధుమలకు బదులు చిరుధాన్యాలను రోజుకు ఒకసారి భోజనంగా తీసుకుంటూ.. చిరుధాన్యాలతో చేసిన చిరుతిళ్లు తింటే జీవనశైలి జబ్బులతో బాధపడేవారు నెలరోజుల్లోనే తమ ఆరోగ్యంలో మంచి మార్పును గమనించవచ్చు’ అంటున్నారు డాక్టర్ మందరపు సౌమ్య. ఆహార శుద్ధి రంగంలో ఉన్నత విద్యను అభ్యసించి, ఆహార సాంకేతిక నిపుణురాలిగా 16 ఏళ్ల అనుభవం కలిగిన సౌమ్య 120 రకాల ఆహారోత్పత్తుల ఫార్ములాలను రూపొందించారు. మూడేళ్ల క్రితం ‘మిల్లెనోవా ఫుడ్స్’ పేరిట స్టార్టప్ సంస్థను నెలకొల్పారు. ఐఐఎంఆర్‌లోని న్యూట్రిహబ్ ద్వారా ఇంక్యుబేషన్ సేవలు పొందారు. తన కృషిని సౌమ్య ఈ విధంగా వివరిస్తూ…