తొలుత గుండెపోటు మరణంగా ప్రకటించిన వైద్యులు.. శవపరీక్షలో ఒంటిపై గాయాలున్నాయని నిర్ధారించారు. దీంతో సోనాలి ఫోగట్ మరణాన్ని అనుమానాస్పద మృతి కేసు నుంచి హత్య కేసుగా మార్చేశారు గోవా పోలీసులు. ఆపై ఆమె అనుచరులు సుధీర్ సంగ్వాన్, సుఖ్విందర్ వాసీలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో.. ఈ ఇద్దరూ ఆమెకు ఇచ్చిన డ్రింకులో 1.5 గ్రాముల ఎండీఎంఏ కలిపినట్లు అంగీకరించారు. అంతేకాదు.. తన అనుచరుల సాయంతో తూలుతూ నడుస్తున్న సోనాలి ఫోగట్ వీడియోలు(సీసీటీవీ ఫుటేజీ)సైతం బయటకు రిలీజ్ చేశారు పోలీసులు.