పాకిస్తానీలు తనని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని నటి, సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ పేర్కొంది. తన మాతృ దేశమైన పాకిస్తాన్ నుంచే సోమీకి బెదిరింపులు రావడం ఆసక్తిని సంతరించుకుంది. ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. తరచూ పాకిస్తాన్ మగవాళ్ల నన్ను చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్స్ పంపిస్తున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీనికి కారణం తను నడిపిస్తున్న ‘నో మోర్ టియర్స్’ ఎన్‌జీవో అని ఆమె పేర్కొంది. సినిమాలకు గుడ్‌బై చెప్పి అమెరికా వెళ్లిపోయిన సోమీ అలీ అక్కడ ఓ ఎన్‌జీవోను స్థాపించి హ్యుమన్ ట్రాఫికింగ్‌కు గురయ్యే బాధితులకు సహాయం అందిస్తోంది.